VPR Foundation: విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్
కావలి:ప్రజాసేవే లక్ష్యంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, మెరుగైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందిస్తున్నామని విపిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని ఆరవ వార్డులో విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.48 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేశారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు జిల్లా అభివృద్ధే తన ధ్యేయమని పేర్కొన్నారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి అంకితభావంతో, నిరంతరం ప్రజాసేవ చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


