Kondaveedu Fort: ఘనంగా నిర్వహించిన కొండవీడు కోట ఉత్సవాలు
పల్నాడు:పల్నాడు జిల్లాలో ఘనంగా నిర్వహించిన కొండవీడు కోట ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని కందుల దుర్గేష్ తెలిపారు. ఈ ఉత్సవాలు జిల్లాలో పర్యాటక రంగానికి కొత్త ఊపునిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్, ట్రెక్కింగ్ మార్గాలు వంటి ప్రత్యేక సౌకర్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. కొండవీడు ఘాట్ రోడ్డును అద్భుతంగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు గారి కృషి అభినందనీయమని కొనియాడారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
రాజుల కాలం నాటి నీటి నిర్వహణ వ్యవస్థ నేటి తరానికి గర్వకారణమని, చారిత్రక వారసత్వ సంపదగా నిలిచిన కొండవీడు కోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రూ.110 కోట్ల నిధులు సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కొండవీడు–అమరావతి–కోటప్పకొండలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేసి, PPP విధానంలో రిసార్టులు మరియు స్టార్ హోటళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
ఇకపై ప్రతి ఏటా ‘కొండవీడు ఉత్సవాలు’ పర్యాటక శాఖ ఈవెంట్ క్యాలెండర్‌లో భాగంగా నిర్వహించి, చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన కొండవీడు కోటను ప్రపంచ పర్యాటక పటంలో నిలిపే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


