YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి శ్రీకారం – పుట్టపర్తిలో జిల్లాస్థాయి సమీక్ష సమావేశం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని, జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి, వార్డు స్థాయి కమిటీల నిర్మాణంపై సమగ్ర చర్చ జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ కో-ఆర్డినేటర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెదిరెడ్డి మిధున్ రెడ్డి గారు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ప్రతి కార్యకర్త పార్టీకి బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రజలతో నేరుగా అనుసంధానం కలిగి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారు, అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామిరెడ్డి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే శ్రీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
అలాగే ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, క్రమశిక్షణతో ప్రజాసేవ కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మరిన్ని Andra Pradesh News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


