Hyderabad Mallapur murder case: సూట్‌కేసులో మృతదేహం గోదావరిలో పడేసిన నిందితులు అరెస్ట్
హైదరాబాద్ మల్లాపూర్‌లో (Hyderabad Mallapur murder case) చోటుచేసుకున్న ఈ దారుణ హత్య నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మల్లాపూర్‌లో ఒంటరిగా నివసిస్తున్న సుజాత (65) ఇంట్లో అద్దెకు ఉంటున్న క్యాబ్ డ్రైవర్ అంజిబాబు ఆమె వద్ద ఉన్న బంగారం కోసం పథకం రచించాడు. ఈ నెల 19న సుజాతను ఆమె ఇంట్లోనే హత్య చేసి, సుమారు 11 తులాల బంగారాన్ని దోచుకున్నాడు. నేరాన్ని దాచేందుకు అంజిబాబు తన స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి కారులో ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాకు తరలించాడు. అక్కడ వైనతేయ గోదావరిలో మృతదేహాన్ని పడేసి ఆనవాళ్లు మాయం చేయాలని ప్రయత్నించాడు. అయితే నాచారం పోలీసులు కేసును ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి సమాచారంతో మంగళవారం అప్పనపల్లి సమీపంలో గోదావరిలో నుంచి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


