Lavanya NIMS death: నిమ్స్‌లో చికిత్స పొందుతూ లావణ్య మృతి
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కళాశాలలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థినిగా చదువుకొని, ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా విధులు నిర్వహిస్తోంది. లావణ్య పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.
తీవ్ర అస్వస్థతకు గురైన లావణ్యను చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లావణ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
లావణ్య ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, సహచరులతో విచారణ జరుపుతూ ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన సిద్దిపేట మెడికల్ కాలేజీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సహ విద్యార్థులు, వైద్య వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


