Shankarpally Road Accident: నలుగురు విద్యార్థులు మృతి
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మీర్జగూడ గ్రామ పరిసరాల్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ప్రమాదంలో శంకర్‌పల్లి మండలం దొంతానపల్లి ఐబీఎస్ (IBS) కళాశాలకు చెందిన బీబీఏ మూడో సంవత్సరం విద్యార్థులు సుమిత్ (20), నిఖిల్ (20), రోహిత్ (18), సూర్యతేజ (20) ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న విద్యార్థిని నక్షత్ర (20) తీవ్రంగా గాయపడగా, ఆమెను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థినికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ విషాద ఘటన కళాశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు, స్థానికులను తీవ్రంగా కలచివేసింది. విద్యార్థుల మృతితో కళాశాల పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


