Father Kills Children: ఇద్దరు పిల్లల హత్య, తండ్రి ఆత్మహత్యాయత్నం
నారాయణపేట: నారాయణపేట జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపింది. మరికల్ మండలం తేలేరు గ్రామానికి చెందిన శివరాం అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు రిథ్విక్, చైతన్యలను హత్య చేసి కాలువలో పడేసిన ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.
పిల్లలకు అనారోగ్యంగా ఉందని, ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి అర్ధరాత్రి సమయంలో పిల్లలను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన శివరాం, అనంతరం పొలం వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డట్లు సమాచారం.
ఈ ఘటన అనంతరం శివరాం పురుగుల మందు తాగడంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల శివరాంకు తన భార్యతో విడాకులు జరిగినట్లు గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. కుటుంబ సమస్యలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


