Shooting Bus Accident: పెద్దఅంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం
సినిమా షూటింగ్ బృందానికి చెందిన బస్సు బోల్తా – ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ శివారులోని పెద్దఅంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ బృందానికి చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. విశాఖపట్నం నుంచి మణికొండకు వెళ్తున్న ఈ బస్సు, పెద్దఅంబర్‌పేట్ ఫ్లైఓవర్ వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
హయత్‌నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో డ్రైవర్లు విజయభాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, అలాగే ఎలక్ట్రిషియన్ విజయ్లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం సమయంలో బస్సులో సినిమా షూటింగ్‌కు సంబంధించిన సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


