Bidar Highway: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో దుర్ఘటన
సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని బీదర్ హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కల్వర్టు గుంతలో పడింది. బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


