Harshita’s death is suspicious: 7వ తరగతి చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి
సిద్దిపేట మండలం మిట్టపల్లి కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న హర్షిత అనే విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటనతో విద్యార్థిని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
విద్యార్థిని స్వగ్రామం బెజ్జంకి మండలం కళ్లేపల్లి కాగా, రాత్రి 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు సమాచారం. అయితే ఈ ఘటనను స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లు తొలుత గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విషయం తెలిసిన వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పాఠశాలకు చేరుకుని బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటనపై స్పష్టత రావాలంటే పోస్ట్‌మార్టం నివేదికతో పాటు అధికారుల విచారణ అవసరమని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గురుకుల పాఠశాలలో భద్రత, విద్యార్థుల సంరక్షణపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరిన్ని Crime News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


