India Germany Relations:భారత–జర్మన్ ఆర్థిక భాగస్వామ్యానికి కొత్త ఊపు
భారతీయ, జర్మన్ సీఈఓలతో ఛాన్సలర్ మెర్జ్ మరియు ప్రధాని మోదీ భేటీ
భారతదేశం–జర్మనీ మధ్య సన్నిహిత సహకారం యావత్ ప్రపంచానికి అత్యంత ముఖ్యమని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఛాన్సలర్ మెర్జ్‌తో కలిసి భారతీయ మరియు జర్మన్ సీఈఓలతో సమావేశం నిర్వహించామని తెలిపారు.
ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై విస్తృతంగా చర్చ జరిగింది. భారతదేశం–జర్మనీ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సార్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకుందని, అనేక జర్మన్ సంస్థలు భారతదేశంలో తమ పెట్టుబడులను గణనీయంగా పెంచుతున్నాయని ప్రధాని మోదీ గారు తెలిపారు.
భారతదేశంలోని సంస్కరణలు, స్థిరమైన విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు జర్మన్ కంపెనీలకు ఆకర్షణగా మారుతున్నాయని పేర్కొన్నారు. తయారీ, ఆవిష్కరణలు, గ్రీన్ ఎనర్జీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో భారత్–జర్మనీ భాగస్వామ్యం మరింత విస్తరిస్తోందని అన్నారు.
రాబోయే కాలంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారంలో కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇరు దేశాల నాయకత్వం ఆకాంక్ష వ్యక్తం చేసింది.
భారత్–జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం గ్లోబల్ ఆర్థిక స్థిరత్వానికి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ గారు స్పష్టం చేశారు.
మరిన్ని International News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


