Fire accident in Germany:హృతిక్ రెడ్డి దుర్మరణం
జర్మనీలో అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి దుర్మరణం చోటు చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన తోకల హృతిక్ రెడ్డి అనే యువకుడు అక్కడ నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో మంటలు వేగంగా వ్యాపించడంతో ప్రాణాపాయ పరిస్థితుల్లో భవనం నుంచి కిందకు దూకిన హృతిక్ రెడ్డికి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే హృతిక్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదువుల్లో ప్రతిభావంతుడిగా పేరు పొందిన హృతిక్ ఉన్నత లక్ష్యాలతో విదేశాలకు వెళ్లాడని కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించింది? భద్రతా ప్రమాణాల్లో లోపాలున్నాయా? అనే అంశాలపై జర్మనీ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
మరిన్ని International News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


