South Coastal Railway Zone: సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడు
విశాఖపట్నం :భోగాపురం ఎయిర్ పోర్టు ట్రయల్ రన్ అనంతరం ఉత్తరాంధ్రకు మరో గుడ్ న్యూస్ అందింది. విశాఖ కేంద్రంగా ప్రతిపాదిత సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.
సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయ కార్యకలాపాలను వేగవంతం చేయడంలో భాగంగా, మొత్తం 959 మంది ఉద్యోగులను ఈ జోన్‌లో పని చేసేందుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్స మరియు సౌత్ కోస్టల్ రైల్వే జీఎం సందీప్ మాధుర్ మధ్య జరిగిన భేటీలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
రైల్వే జోన్ కార్యాలయానికి అవసరమైన మానవ వనరుల కేటాయింపుపై ప్రస్తుతం ముమ్మరంగా కసరత్తు కొనసాగుతోంది. ఉద్యోగుల బదిలీలతో జోన్ పరిపాలనా వ్యవస్థ మరింత బలపడనుంది.
ఇదిలా ఉండగా, విశాఖలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులు ఇప్పటికే జోరుగా కొనసాగుతున్నాయి. జోన్ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే, ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు, మౌలిక వసతుల విస్తరణకు గణనీయమైన ఊతం లభించనుంది.
భోగాపురం ఎయిర్ పోర్టు, రైల్వే జోన్ వంటి వరుస అభివృద్ధి కార్యక్రమాలతో విశాఖ — ఉత్తరాంధ్ర అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


