హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి బైక్ స్కిడ్ అయి లారీ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన కానూరు రాజు (30) కమలాపూర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. రోడ్డుపై అదుపు తప్పిన బైక్ స్కిడ్ కావడంతో రాజు ఎదురుగా వస్తున్న లారీ కింద పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన రాజు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదంతో గట్ల కనపర్తి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


