Bhatti Vikramarka: ప్రజలతో నడిచిన పాదయాత్ర… ప్రజలతోనే నడిచే ప్రభుత్వం
ఆదిలాబాద్: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలే బలమని ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు పేర్కొన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సమయంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దేవుగూడ గూడెంలో గ్రామస్తులు చూపిన ఆత్మీయతను మరువలేక, ఆయన మళ్లీ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
పాదయాత్ర సమయంలో గంగుబాయి, లక్ష్మీబాయి గార్లు భోజనం పెట్టడమే కాకుండా, కొన్ని కిలోమీటర్లు కలిసి నడిచి ప్రజా ప్రభుత్వం రావాలని ఆశీర్వదించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ దీవెనల ఫలితంగానే నేడు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
గ్రామ సందర్శనలో భాగంగా ఇళ్ల సమస్యలు, డ్రైనేజీ, పట్టాదారు పాస్‌పుస్తకాలు, విద్యుత్ వంటి అంశాలను పరిశీలించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ఇచ్చిన మాట ప్రకారం గంగుబాయి, లక్ష్మీబాయి గార్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆ ఇల్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులను ప్రజాభవన్‌కు భోజనానికి ఆహ్వానిస్తూ, వారితో గడిపిన క్షణాలు ఎంతో ఆత్మీయంగా నిలిచిపోయాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలతో కలిసి నడిచిన ప్రభుత్వం, ప్రజలతోనే పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


