Home Minister Amit Shah: “ఇది బీహార్ కాదు… తమిళనాడు, మీ రాజకీయాలు ఇక్కడ సాగవు”
తమిళనాడు ముఖ్యమంత్రి(Home Minister Amit Shah) ఎం.కె.స్టాలిన్ బీజేపీపై, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు.
“మీరు ఎన్ని జన్మలు ఎత్తినా బీజేపీకి ఇక్కడ అధికారం రాదు”
బీజేపీ నాయకులు ఎంతమంది వచ్చినా, ఎంత ప్రచారం చేసినా తమిళనాడు ప్రజలు ఆ పార్టీని అంగీకరించరని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
“మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఇక్కడ బీజేపీ అధికారంలోకి రాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.
“ఇది బీహార్ కాదు… తమిళనాడు”
ఉత్తరాది రాజకీయాలకు ఇక్కడ స్థానం లేదన్న స్టాలిన్
తమిళనాడు రాజకీయ సంస్కృతి ఇతర రాష్ట్రాలకు భిన్నమని స్టాలిన్ స్పష్టం చేశారు.
“ఇది బీహార్ కాదు, తమిళనాడు. అక్కడ పనిచేసే రాజకీయాలు ఇక్కడ సాగవు” అంటూ బీజేపీ నాయకత్వానికి ఘాటు సందేశం పంపారు.
ప్రేమతో వస్తే స్వాగతం… అహంకారంతో వస్తే తరిమేస్తాం
కేంద్ర నాయకులకు తమిళ ప్రజల మనస్తత్వం అర్థం కావాలని స్టాలిన్ హితవు పలికారు.
“మీరు ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో, దురహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు” అంటూ స్పష్టమైన హెచ్చరిక చేశారు.
అమిత్ షా కాదు… మొత్తం బీజేపీ వచ్చినా గెలవలేరు
అమిత్ షా ఒక్కరే కాదు, మొత్తం బీజేపీ నాయకత్వం తమిళనాడులో పర్యటించినా గెలుపు సాధించడం అసాధ్యమని సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు.
డీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో బలమైన విశ్వాసం ఉందని, సామాజిక న్యాయం, సమాఖ్య భావనలే తమ రాజకీయ పునాదులని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


