Praja Bhavan Women’s Federation Meeting: మహిళా నాయకత్వానికి ప్రోత్సాహం
ప్రజా భవన్‌లో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో సమావేశం నిర్వహించి, సూర్యాపేట మరియు వనపర్తి జిల్లాల నుంచి సర్పంచులుగా ఎన్నికై జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మహిళలను ఘనంగా సన్మానించాను. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళలు నాయకత్వ భూమికల్లో ముందుకు రావడం ఎంతో గర్వకారణమని ఈ సందర్భంగా పేర్కొన్నాను.
మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ స్వయం ఆధారితంగా నిలబడేలా చేస్తున్న సెర్ప్ (SERP) సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేశాను. నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు మరింత బాధ్యతతో, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని సూచించాను.
కేరళ నమూనాను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా అత్యంత పేద కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి సూక్ష్మ స్థాయి ప్రణాళికను రూపొందించనున్నామని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మహిళా సమాఖ్యల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశాను. మహిళల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నాను.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


