Local Elections Suryapet: ఒకరు మృతి, 15 మందికి గాయాలు
సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో పంచాయతీ ఎన్నికల(Local elections) వేళ ఉద్రిక్తత చెలరేగింది. ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాల కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ఘర్షణలో ఒకరి మృతి
ఈ ఘటనలో బీఆర్ఎస్ వార్డు మెంబర్ అభ్యర్థి మామ ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడి, హైదరాబాద్‌కు తరలించే సమయంలో మార్గమధ్యంలో మరణించాడు. దాదాపు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసినట్లు స్థానిక సమాచారం.
15 మందికి గాయాలు
ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన సుమారు 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని హైదరాబాద్‌కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
పోలీసుల చర్యలు
ఘటన చోటుచేసుకున్న వెంటనే పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో అదనపు బలగాలను మోహరిచినట్లు సమాచారం.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


