Union Budget 2026-27: కేంద్ర బడ్జెట్ 2026-27
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించింది. ప్రతి ఏటా దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన తేదీని కేంద్రం ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్(Union Budget 2026-27) 2026-27 ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ కావడంతో రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది.
2026-27 ప్రకటన తేదీ ఖరారు
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) రోజున పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఈసారి కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయ సభల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు కేంద్ర కేబినెట్ ఆమోదం తీసుకున్న అనంతరం ఆమె బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు.
కొత్త ఏడాది ప్రారంభం కావడం, ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుండటంతో ఇప్పటినుంచే బడ్జెట్ రూపకల్పనపై కేంద్రం దృష్టి సారించింది. వివిధ శాఖలకు ఎంత మేర నిధులు కేటాయించాలి, ఏ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి.
ద్రవ్యోల్బణం, రూపాయి విలువ ప్రభావం
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఊరట కలిగించే విధంగా బడ్జెట్ ఉంటుందా? మధ్యతరగతి, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఏలాంటి ప్రయోజనాలు కల్పిస్తారు? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా ఈ బడ్జెట్ కీలకంగా ఉండనుంది. అందుకే కేంద్ర బడ్జెట్ 2026-27పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మరిన్ని Latest News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


