మున్సిపాలిటీల ఆర్థిక బలోపేతానికి కేంద్ర బడ్జెట్ కీలక నిర్ణయాలు: జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్: గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో, సహకార సమాఖ్య స్ఫూర్తితో మున్సిపాలిటీలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా కేంద్ర బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారు తెలిపారు.
గౌరవ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన ఈ బడ్జెట్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి దోహదపడడమే కాకుండా, నగరాలు స్వయం సమృద్ధిని సాధించేలా మార్గం చూపుతాయని ఆయన అన్నారు.
బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు
- పెద్ద నగరాల్లో ఒకేసారి ₹1000 కోట్లకు పైగా మున్సిపల్ బాండ్‌లు జారీ చేస్తే ₹100 కోట్ల ప్రోత్సాహకం
- చిన్న పట్టణాలకు AMRUT పథకం కింద ₹200 కోట్ల వరకు ప్రస్తుత ప్రోత్సాహ పథకం కొనసాగింపు
ఈ నిర్ణయాల వల్ల ప్రయోజనాలు
- పట్టణ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి
- స్థానిక సంస్థల ఆర్థిక సామర్థ్యం మరింత బలపడుతుంది
- పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి
ఈ బడ్జెట్ నిర్ణయాలు దేశంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి, స్థానిక సంస్థల స్వావలంబనకు కీలకంగా మారనున్నాయని కిషన్ రెడ్డి గారు పేర్కొన్నారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


