Srisailam Maha Shivaratri: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం: శ్రీశైలంలో త్వరలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి శ్రీమతి అనితా వంగలపూడి గారు అధికారులను ఆదేశించారు.
సదాశివయ్య భవన్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సహచర మంత్రులు శ్రీ అనం రెడ్డి గారు, శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ హరిజవహర్ లాల్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గారు, దేవస్థానం ఈవో శ్రీ శ్రీనివాసరావు గారు, దేవస్థానం బోర్డు ఛైర్మన్ శ్రీ రమేశ్ నాయుడు గారు, ఎస్పీ శ్రీ సునీల్ షోరాన్ గారుతో పాటు ఫారెస్ట్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో చర్చించిన ముఖ్య అంశాలు
- భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ
- భక్తులకు వసతి సౌకర్యాలు
- తాగునీటి సరఫరా
- క్యూలైన్లలో సౌకర్యాలు
- పారిశుధ్యం, వైద్య సదుపాయాలు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సాఫీగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి అనితా వంగలపూడి గారు సూచించారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


