Ernakulam – Tatanagar Express train :
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎర్నాకులం – టాటానగర్ ఎక్స్‌ప్రెస్ రైలు (18189)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
రైలులోని B1 ఏసీ కోచ్‌లో మంటలు చెలరేగగా, అవి క్రమంగా M2 ఏసీ కోచ్‌కు వ్యాప్తి చెందాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై చెయిన్ లాగి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అప్రమత్తమై మంటలు అంటుకున్న బోగీలను మిగతా బోగీల నుంచి వేరు చేశారు. అగ్నిమాపక చర్యలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
- అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
- అయితే, మంటల్లో కొన్ని ప్రయాణికుల లగేజీ బ్యాగులు కాలిపోయాయి
ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


