Happy Bhogi: దేశ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన ఎం. వెంకయ్య నాయుడు
నెల్లూరులో కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను జరుపుకున్న ఉపరాష్ట్రపతి మాజీ గౌరవనీయులు ఎం. వెంకయ్య నాయుడు
నెల్లూరులో కుటుంబ సభ్యులందరితో కలిసి భోగి పండుగను జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని ఉపరాష్ట్రపతి మాజీ గౌరవనీయులు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ తమ కుటుంబ సభ్యుల తరఫున భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
భోగి పండుగ సందర్భంగా చిన్నా–పెద్దా అంతా కలిసి ఆనందోత్సాహాలతో వేసే భోగి మంటలు ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలనే గొప్ప సందేశాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.
భోగి పండుగ అందరి జీవితాల్లో భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఇంట సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని నింపాలని ఆయన కోరారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


