Vanapravesham: భక్తి, సంప్రదాయం, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం
మేడారం: వన దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం మహా జాతర భక్తి భావోద్వేగాల నడుమ వైభవంగా ముగిసింది. నాలుగు రోజుల పాటు మేడారం ప్రాంతం ఆధ్యాత్మిక కాంతులతో మెరిసి, సంబురం అంబరాన్ని తాకింది.
వనం నుంచి గద్దెలపైకి విచ్చేసిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు తిరిగి వన ప్రవేశం చేసిన క్షణం భక్తుల హృదయాలను కదిలించింది. ఆ దృశ్యం భక్తి, విశ్వాసం, భావోద్వేగాల సంగమంగా నిలిచి ప్రతి ఒక్కరిలో అపార నమ్మకాన్ని నింపింది.
నాలుగు రోజులుగా అశేష భక్తజనం జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసి, వన దేవతలకు బంగారం (బెల్లం), మొక్కులు సమర్పించారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఆచారాలు, సంప్రదాయాలు, శాశ్వత నిర్మాణాలు జాతరకు కొత్త చరిత్రను లిఖించాయి.
ఈ మహా ఉత్సవం గిరిజన సంప్రదాయాల గొప్పతనాన్ని, ప్రజల ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం గొప్ప సంకల్పంతో జాతరను ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించాలన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయం సాకారమైంది. సహచర మంత్రులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జాతర విజయవంతంగా ముగియడానికి విశేషంగా కృషి చేశారు.
ఈ సందర్భంగా జాతర నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, శ్రీ సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
జై సమ్మక్క!
జై సారక్క!
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


