Union Budget: బడ్జెట్ సమర్పణకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరితో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ సమర్పణకు సిద్ధమవుతున్న ఆర్థిక మంత్రి మరియు ఆమె బృందానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ఆకాంక్ష వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని కలవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ భేటీతో కేంద్ర బడ్జెట్ ప్రక్రియకు అధికారిక ఆరంభం లభించినట్లైంది.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


