Somnath Swabhiman Parv: భారత నాగరికత ధైర్యానికి ప్రతీక
మన నాగరికతా ధైర్యానికి, ఆత్మగౌరవానికి గర్వించదగిన ప్రతీక అయిన సోమనాథ క్షేత్రంలో ఉండటం తనకు అదృష్టంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1026లో సోమనాథ దేవాలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఏకమై నిర్వహిస్తున్న #సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా ఆయన ఈ పర్యటన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, అనేక దాడులు, విధ్వంసాలు ఎదుర్కొన్నప్పటికీ సోమనాథ ఆలయం భారతీయ సంస్కృతి, విశ్వాసం మరియు ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు చిహ్నంగా నిలిచిందని పేర్కొన్నారు. వెయ్యేళ్ల చరిత్రలో దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా, భారత నాగరికత శాశ్వతమై నిలిచిందని ఆయన అన్నారు.
సోమనాథ స్వాభిమాన్ పర్వ్ ద్వారా దేశ ప్రజల్లో జాతీయ గౌరవ భావన మరింత బలపడుతుందని, గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా తనకు లభించిన ఆత్మీయ స్వాగతానికి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని National News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


