back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeNational Politicsబళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. కాల్పుల్లో ఒకరు మృతి

బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. కాల్పుల్లో ఒకరు మృతి

Gali Janardhan Reddy assassination attempt: కాల్పుల్లో ఒకరు మృతి

కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. వాల్మీకి విగ్రహ ఏర్పాటు ఫ్లెక్సీల విషయంలో తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

ఈ ఘర్షణలో ఎమ్మెల్యే భరత్ రెడ్డి గన్‌మన్ తుపాకీతో గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. పరస్పర కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, కాల్పులు జరిపిన సతీష్ రెడ్డికి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఘటన అనంతరం బళ్లారి నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ, భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లెక్సీల వివాదం ఎలా కాల్పులకు దారి తీసిందనే అంశంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజకీయ వర్గాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని National Politics వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles