KKR’s Mustafizur is out: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం అధికారికంగా ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించింది
బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు బీసీసీఐ నుంచి షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి ముస్తాఫిజుర్‌ను తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) యాజమాన్యం అధికారికంగా ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించింది.
బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భద్రతా, సున్నిత అంశాలను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఈ విషయంపై కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది IPL వేలంలో ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు రూ.9.20 కోట్ల భారీ ధర పలికింది. అయితే తాజా పరిణామాలతో ఆయన IPL ప్రయాణం ఈ సీజన్‌కు ముగిసినట్లైంది. ముస్తాఫిజుర్ తొలగింపుతో KKR జట్టు కాంబినేషన్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.
ఈ నిర్ణయం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు రాజకీయ, సామాజిక పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని కొందరు అభిప్రాయపడుతుండగా, మరోవైపు బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.
మరిన్ని Sports News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


