Medaram Jathara: రాత్రి లేదు… పగలు లేదు…
తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు సమక్క–సారక్క దర్శనం కోసం భక్తులు గుంపులు గుంపులుగా మేడారానికి తరలివస్తున్నారు. వేలాది మంది భక్తులు వనదేవతల దర్శనం కోసం నిరంతరం బారులు తీరుతున్నారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు 24 గంటలూ విధుల్లో ఉంటూ, యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం సాఫీగా జరిగేలా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత, వైద్య, తాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లను సమన్వయంతో అమలు చేస్తున్నారు.
మేడారం జాతరలో భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంతో, అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. భక్తులు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో వనదేవతల దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


