Mahbubnagar Janasena meeting: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశం
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం : ప్రేమ కుమార్
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల కో–ఆర్డినేటర్ శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మహబూబ్‌నగర్ బస్టాండ్ సమీపంలోని భారత్ కన్వెన్షన్ హాల్‌లో జరిగింది.
ఈ సందర్భంగా ప్రేమ కుమార్ గారు మాట్లాడుతూ, జనసేన పార్టీ లక్ష్యం ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమేనని, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రతి కార్యకర్త బాధ్యత అని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా, సమిష్టిగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీని ప్రజల మధ్యకు మరింత చేరువ చేయడానికి తీసుకోవాల్సిన కార్యాచరణ, స్థానిక సమస్యలపై పోరాటం, యువత మరియు మహిళల భాగస్వామ్యం వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. క్రమశిక్షణ, ఐక్యతే విజయానికి మూలమని ప్రేమ కుమార్ గారు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వివిధ నియోజకవర్గాలకు చెందిన నాయకులు పిఆర్ రఘు, గోనెల భరద్వాజ్, శ్రీవల్లి, ముకుంద నాయుడు, సాంబశివుడు, కుర్మయ్య, మణికంఠ, సిద్ధు, అశ్రఫ్, శరత్ గౌడ్, నల్లమల శివతో పాటు పట్టణ, మండల, జిల్లా స్థాయి నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకుంటున్న ఔత్సాహికులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సమావేశం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు దోహదపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


