Potters’ Brainstorming Session:
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని రాఘవ బ్యాంక్వెట్ హాల్‌లో “అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్” ఆధ్వర్యంలో నిర్వహించిన కుమ్మరుల మేధోమధన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యాను.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కులంలో ఉన్న అన్ని సంఘాలు ఏకతాటిపై నిలబడినప్పుడే నిజమైన బలం వస్తుందని, ఒకే ఎజెండాతో ముందుకు సాగితేనే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నాను. మన మధ్య చీలికలు, అనైక్యత వేరొకరికి లాభం చేకూరుస్తాయని, వాటిని పక్కనపెట్టి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చాను.
ఒకప్పుడు కుమ్మర్లు గొప్పగా జీవించిన చరిత్ర ఉందని, అయితే నేడు సంప్రదాయ వృత్తి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాను. ఇప్పుడు సమయం వచ్చింది, చైతన్యం వచ్చింది—ఐక్యంగా నిలబడి మన హక్కులు, అవసరాలు సాధించుకోవాలని సూచించాను.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు, కుమ్మర సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


