Budvel fire accident: దట్టమైన పొగతో భయాందోళన
రాజేంద్రనగర్ బుద్వేల్‌లో ప్లాస్టిక్ రీసైకిల్ గోదాంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రాంతంలో ఉన్న ప్లాస్టిక్ రీసైకిల్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన నల్లని పొగ ఆకాశాన్ని కమ్మేసింది.
మంటలు ఎగిసిపడటంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన పలు వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. పూర్తిస్థాయి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


