Tungaturthi auto accident: సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా – పది మందికి గాయాలు
సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి శివారు ప్రాంతంలో శనివారం కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టడంతో పది మందికి గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే, మానాపురం గ్రామంలోని మిరపతోటలో కలుపు తీయడానికి పక్కనే ఉన్న రావులపల్లి గ్రామం నుంచి దాదాపు 11 మంది కూలీలు ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. రావులపల్లి శివారు ప్రాంతం దాటిన వెంటనే ఎదురుగా అడ్డొచ్చిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన సమయంలో ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో బొడ్డుపల్లి పద్మ, జోగునూరి బేబీ, జోగునూరి మరియమ్మ, జోగునూరి కుమారితో పాటు మరికొంతమందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొంతమంది తుంగతుర్తి ఏరియా ఆసుపత్రిలో, మరికొంతమంది మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ ప్రాంతంలో చికిత్స పొందుతున్నారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


