Telangana Minority Residential Schools,: మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2026–27 ప్రవేశాల ప్రచార కరపత్రాల విడుదల
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రారంభానికి సంబంధించిన ప్రచార కరపత్రాలను నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ కలెక్టరేట్ ఛాంబర్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, భోజన సౌకర్యాలతో పాటు పోటీ ప్రపంచానికి తగిన విధంగా విద్యాబోధన అందించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం కరపత్రాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాలపై అవగాహన కలిగి, తమ పిల్లల భవిష్యత్తుకు సరైన దిశానిర్దేశం చేయాలని కలెక్టర్ కోరారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


