Nirmal Municipal Counting: మున్సిపల్ ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. లెక్కింపు ప్రక్రియ సమయపాలన, పారదర్శకతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి టేబుల్ వద్ద విధుల్లో ఉన్న సిబ్బంది నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
సాధారణ పరిశీలకులు వీరారెడ్డి పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. అదే క్రమశిక్షణతో కౌంటింగ్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్ హాలుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వ్యవస్థను పరిశీలించి పర్యవేక్షణ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


