Arrive Alive Program: కూకట్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
హెల్మెట్లు పంపిణీ చేసిన సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ ఐపీఎస్
సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లిలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్ (Arrive Alive)’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ హెల్మెట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ
- “స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో పాటించాలని పిలుపునిచ్చారు.
- ముఖ్యంగా యువత, విద్యార్థులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
సైబరాబాద్ వ్యాప్తంగా జనవరి 13 నుండి 23 వరకు పలు విద్యాసంస్థలు, కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. హెల్మెట్ వినియోగం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ నియమాల ప్రాధాన్యతపై ప్రజల్లో చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
అందరం కలిసి రోడ్డు ప్రమాదాలను నివారిస్తూ ప్రమాద రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని సీపీ పిలుపునిచ్చారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


