Bhadrakali Bund: డి, ఇ జోన్ల పనులు రెండు రోజుల్లో పూర్తి చేయాలి ఫ్లోరింగ్, హార్టికల్చర్ పనులకు గడువు నిర్ధారణ
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలోని భద్రకాళి బండ్‌పై కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రకాళి బండ్‌లోని డి, ఇ జోన్లలో కొనసాగుతున్న పనులను రెండు రోజుల్లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే, బండ్ సుందరీకరణలో భాగంగా చేపడుతున్న ఫ్లోరింగ్, హార్టికల్చర్‌కు సంబంధించిన పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
భద్రకాళి బండ్‌ను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడంతో పాటు, నగరవాసులకు ఆహ్లాదకరమైన విహార స్థలంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


