back to top
31.2 C
Hyderabad
Sunday, March 1, 2026
HomeTelangana Newsభూపాలపల్లి మున్సిపాలిటీలో అటవీ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన – మంత్రి పొన్నం ప్రభాకర్

భూపాలపల్లి మున్సిపాలిటీలో అటవీ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన – మంత్రి పొన్నం ప్రభాకర్

Protection Wall Bhupalpally: కృష్ణ కాలనీ, యాదవ కాలనీలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ కాలనీ, యాదవ కాలనీలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో ప్రొటెక్షన్ వాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు గారితో కలిసి శంకుస్థాపన చేశారు.

Follow BuzzNewsline: Twitter (X) | Instagram

అటవీ ప్రాంతం సమీపంలో నివసిస్తున్న ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు, వర్షాకాలంలో మట్టి కొట్టుకుపోవడం, అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఈ ప్రొటెక్షన్ వాల్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

శంకుస్థాపన అనంతరం, మధర్ థెరిస్సా పట్టణ సమాఖ్య మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Buzznewsline
Buzznewsline
BuzzNewsline is a next-gen digital media platform delivering real-time news, trending stories, and deep insights across sports, politics, entertainment, tech, and more — all in one place.”

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles