BJP Maharashtra Victory: నాంపల్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయోత్సవాలు
బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)తో పాటు మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రక విజయాన్ని పురస్కరించుకొని, హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత శ్రీ ఎన్. రామచందర్ రావు మాట్లాడుతూ, ఈ విజయం దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజలకు ఉన్న దృఢమైన విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి మరియు సుస్థిర పాలన విధానాలే ఈ విజయానికి కారణమని తెలిపారు.
మహారాష్ట్రలో లభించిన ఈ ఘన విజయం ఇచ్చిన ఉత్సాహమే రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ బీజేపీ విజయానికి బాటలు వేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ విజయోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్, శ్రీ గౌతమ్ రావు, శ్రీ వేముల అశోక్, శ్రీ వీరేందర్ గౌడ్ తదితర బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


