Telangana irrigation problem: కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నీటి కేటాయింపులపై నిరాధార ఆరోపణలు
హైదరాబాద్ :తెలంగాణ సాగునీటి అంశాలపై ప్రజల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలకు చెక్ పెట్టేందుకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శ్రీ వెదిరె శ్రీరామ్ గారు పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వాస్తవాలను స్పష్టంగా వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు నీటి కేటాయింపులపై నిరాధార ఆరోపణలు చేస్తూ, తమ పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నాయని తీవ్రంగా విమర్శించారు.
గత 11 ఏళ్లలో తెలంగాణలో కొత్తగా సాగులోకి వచ్చిన విస్తీర్ణంపై ఈ రెండు పార్టీలు సమాధానం చెప్పలేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ, వాస్తవ లబ్ధి ఎంతమేర రైతులకు చేరిందన్న అంశంపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సమాఖ్య వ్యవస్థకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలిచిందని, నీటి కేటాయింపుల విషయంలో కూడా న్యాయసమ్మతమైన విధానాన్నే అనుసరిస్తోందని వివరించారు. అసెంబ్లీలో ఈ అంశాలపై వాస్తవాలను చర్చించేందుకు తగిన అవకాశం ఇవ్వకపోయినా, ప్రజలకు నిజాలు తెలియజేయాలనే బాధ్యతతో ఈ డేటాను బహిర్గతం చేశామని తెలిపారు.
తెలంగాణకు న్యాయబద్ధమైన నీటి వాటా దక్కే వరకు బీజేపీ పోరాటం ఆగదని, రైతుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


