Chief Minister’s Cup 2025: గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి క్రీడలు
చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్–2025 పోస్టర్ ఆవిష్కరణ
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ నెలలో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించిన చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్–2025 పోస్టర్‌ను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనవరి 8 నుంచి 17 వరకు పది రోజుల పాటు టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
పోటీల షెడ్యూల్ వివరాలు
జనవరి 17 – 22 : గ్రామ స్థాయి
జనవరి 28 – 31 : మండల స్థాయి
ఫిబ్రవరి 3 – 7 : నియోజకవర్గ స్థాయి
ఫిబ్రవరి 10 – 14 : జిల్లా స్థాయి
ఫిబ్రవరి 19 – 26 : రాష్ట్ర స్థాయి
డిసెంబర్ నెలలో జరగాల్సిన ఈ పోటీలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడగా, ఇప్పుడు సవరించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు.
క్రీడా విశేషాలు
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ (SATTS) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, గ్రామీణ ప్రతిభను వెలికి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో
మంత్రి వాకిటి శ్రీహరి గారు
శాట్స్ చైర్మన్ శ్రీ శివసేన రెడ్డి గారు
స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ గారు
సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు గారు
SATG ఎండీ సోనీబాల గారు
పాల్గొన్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


