Palamuru IIIT foundation stone laying: పాలమూరు జిల్లాలో IIIT శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్ సందడి
నేడు పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమం తరువాత, జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖ్యమంత్రి ముఖాముఖిగా సమావేశమవ్వనున్నారు. అలాగే, జిల్లా మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు సంబంధించిన పలు శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించనున్నారు.
దీనితో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొని ప్రజలతో సంభాషణ నిర్వహించనున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


