Greetings to the women teachers: సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళల విద్యకు మార్గదర్శకురాలైన శ్రీమతి సావిత్రీబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళల విద్య కోసం సావిత్రీబాయి ఫూలే గారు చేసిన త్యాగం అమూల్యమని, విద్యనే ఆయుధంగా చేసుకుని సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆమె జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని అన్నారు.
సావిత్రీబాయి ఫూలే గారి ఆశయాలను కొనసాగిస్తూ, జ్ఞాన దీపాలను వెలిగిస్తూ విలువల బాటలో విద్యార్థులను నడిపిస్తున్న ప్రతి మహిళా ఉపాధ్యాయురాలికి ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


