CM Revanth Reddy New Year: బేగంపేట IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, సీనియర్ IAS అధికారులు, అసోసియేషన్ సభ్యులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్ర పరిపాలనలో IAS అధికారుల పాత్ర అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన, పారదర్శక సేవలు అందించడంలో అధికారులు మరింత నిబద్ధతతో పని చేయాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం రాష్ట్రానికి శుభప్రదంగా ఉండాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వ యంత్రాంగం సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
ఈ వేడుకలు ఆత్మీయ వాతావరణంలో సాగాయి. అధికారులు, సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ, రాబోయే సంవత్సరంలో తెలంగాణ అభివృద్ధికి కలిసి కట్టుగా కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


