Y Shagapur Sarpanch Nikitha: వై.షాగాపూర్ నూతన సర్పంచ్ నిఖితను అభినందించిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి
గ్రామ త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం
పెబ్బేరు: పెబ్బేరు మండలం వై.షాగాపూర్ గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికై, ప్రస్తుతం ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న యువతి నిఖితను కలవడం ఆనందంగా ఉందని ప్రజాసేవకుడు శ్రీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
యువత రాజకీయాల్లోకి రావడం, ముఖ్యంగా చదువుతో పాటు ప్రజాసేవను లక్ష్యంగా పెట్టుకుని బాధ్యతలు స్వీకరించడం అభినందనీయమని ఆయన అన్నారు. నిఖిత వంటి యువ నాయకత్వం గ్రామాభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు తక్షణమే రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు.
గ్రామ ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించడం అత్యవసరమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


