illegally selling defense liquor: డిఫెన్స్ లిక్కర్ స్వాధీనం… పోలీసుల అదుపులో నిందితుడు
అల్వాల్‌లో అక్రమ మద్యం విక్రయంపై ఎస్టీఎఫ్ దాడి
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అక్రమ మద్యం విక్రయం వెలుగులోకి వచ్చింది. కౌకూర్‌లోని శ్యామల కన్వెన్షన్ దగ్గర ఉన్న వెంకటేశ్వర నగర్‌లో గురువారం డిఫెన్స్ లిక్కర్‌ను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. డిఫెన్స్ డ్యూటీ-ఫ్రీ లిక్కర్‌ను బయట విక్రయించడం(illegally selling defense liquor) చట్టవిరుద్ధం కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు.
డిఫెన్స్ బాటిల్స్ అమ్మిన వ్యక్తి అరెస్ట్
అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి 20 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఎస్టీఎఫ్ ‘D’ టీంకు సమాచారం అందింది. వెంటనే సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
పోలీసులు అక్కడ నుంచి మొత్తం 20 బాటిళ్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిపై కేసు నమోదు
స్వాధీనం చేసిన మద్యం మరియు నిందితుడిని పోలీసులు అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమ మద్యం విక్రయం, డిఫెన్స్ లిక్కర్ తస్కరించటం, చట్ట విరుద్ధంగా అమ్మకాలు జరపడం వంటి నేరాలపై కేసు నమోదు చేయనున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


