Bhatti Vikramarka Mallu: తిరుమలలో శ్రీవారి దర్శనం
తిరుమల: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, సంతోషంగా, ఆర్థికంగా బలంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అలాగే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా మరింత ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి మరియు అభివృద్ధి కోసం స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


