Bhoothpur Municipality: భూత్పూర్ మున్సిపాలిటీలో రూ.10.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మున్సిపాలిటీలో రూ.10.50 కోట్ల వ్యయంతో ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సహచర మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ రెడ్డి గారితో కలిసి గౌరవ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ, భూత్పూర్ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి దిశగా చేపట్టిన ఈ పనులు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పట్టణ సౌందర్యీకరణ, ప్రజా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని, ప్రతి ప్రాంతంలో సమతుల్య అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


