Kaudipally PHC Inspection: ఆరోగ్య సేవల్లో నాణ్యత, క్రమశిక్షణ తప్పనిసరి: కలెక్టర్
మెదక్: జిల్లాలో ప్రజలకు అందుతున్న ప్రాథమిక ఆరోగ్య సేవల పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ & జిల్లా మజిస్ట్రేట్, మెదక్ గారు బుధవారం కౌడిపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్, ఓపీ (OP) రిజిస్టర్లు, అలాగే మెడిసిన్ స్టోర్‌ను సవివరంగా పరిశీలించారు. రోగులకు సరైన సమయంలో సేవలు అందుతున్నాయా, మందుల లభ్యతలో ఎలాంటి లోపాలు ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీశారు.
ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు, సిబ్బంది పూర్తి బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ గారు ఆదేశించారు. హాజరు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
అదేవిధంగా పీహెచ్‌సీలలో పరిశుభ్రత, మందుల నిల్వ, రోగులతో సిబ్బంది వ్యవహరించే తీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


