Louis Ideal School for the Blind: అంధ విద్యార్థుల సమక్షంలో ఘనంగా వేడుకలు జరిగాయి
వరంగల్:అంధుల విద్యకు దిశానిర్దేశం చేసిన మహానుభావుడు డా. లూయిస్ బ్రేలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వరంగల్ నగరంలోని కొత్తవాడలో ఉన్న లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ వరంగల్ మేయర్ శ్రీమతి సుధారాణి గుండు గారు మరియు జిల్లా కలెక్టర్ గారితో కలిసి పాల్గొని అంధ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రేలీ లిపి ద్వారా అంధులకు విద్య, ఉపాధి అవకాశాలు విస్తరించాయని వారు పేర్కొన్నారు.
అంధ విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, ప్రభుత్వం వారి సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మేయర్ వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అవగాహన పెంచడంతో పాటు, దివ్యాంగుల సాధికారతకు తోడ్పడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, అంధ విద్యార్థులు తదితరులు పాల్గొని డా. లూయిస్ బ్రేలీ సేవలను స్మరించుకున్నారు.
మరిన్ని Telangana News వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


